పెద్దపల్లి
జిల్లాలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, రైతులందరికీ మద్దతు ధర అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ధాన్యం కొనుగోలు అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో 305 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం దిగుబడి మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఇప్పటివరకు 57 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించా రని, వరి కోతలు వేగం పెరుగుతున్నం దున వెంటనే జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌళిక వసతులు, టార్ఫాలిన్లు, క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం 17 లోపు ఉండాలనే అంశాలపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం సరఫరా చేసే సమయంలో వాహనాలు పరిమితికి లోబడి మాత్రమే ధాన్యం నింపాలని, ఓవర్ కెపాసిటీ కావద్దని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీట్ లో జనరేట్ చేయాలని , రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులకు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ట్యాగింగ్ చేయాలని, ప్రణాళిక బద్ధంగా కొనుగోలు కేంద్రం వద్దకు రైతు ధాన్యం తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్ల వద్ద ఉన్న గన్ని బ్యాగుల నాణ్యత పరిశీలించాలని, కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లర్లను అలాట్ చేస్తూ గన్ని బ్యాగులు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
- Advertisement -
- Advertisement -