Saturday, February 21, 2026

G20 .. కంట్రోల్డ్ జోన్ గా ఢిల్లీ

- Advertisement -

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7, (వాయిస్ టుడే): సెప్టెంబర్ 9,10వ తేదీల్లో ఢిల్లీ వేదికగా G20 సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు వస్తుండడం వల్ల సెక్యూరిటీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. సమావేశాలు జరిగే వేదిక సమీపంలో సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీకి చేరుకోనున్నారు.

g20-delhi-as-controlled-zone
g20-delhi-as-controlled-zone

రాత్రి 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాదాపు నాలుగు రోజుల పాటు నిఘా నీడలోనే ఉండనుంది ఢిల్లీ. గూడ్స్ వెహికిల్స్‌ తిరగకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. ట్యాక్సీలు, ఆటోలకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఓ గెజిట్ విడుదల చేసింది. మొత్తం నగరాన్ని “Controlled Zone” గా ప్రకటించింది. కేవలం అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతినివ్వనుంది ప్రభుత్వం. హౌజ్‌ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్స్‌కి సంబంధించిన వెహికిల్స్‌కి ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్‌తో పాటు, మార్కెట్‌లను పూర్తి స్థాయిలో రెండు రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ కంట్రోల్డ్‌ జోన్‌లోకి ఫ్లిప్‌కార్ట్,అమెజాన్‌తో పాటు స్విగ్గీ, జొమాటోలకూ అనుమతి లేదు. మెక్సికన్, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఢిల్లీకి రానున్నారు. అయితే…ఎక్కువ మంది అధినేతలు, ప్రతినిధులు మాత్రం రేపు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ఢిల్లీకి రానున్నారు. వీళ్లను ఆహ్వానించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. వీవీఐపీల విమానాలు ల్యాండ్ అయ్యేందుకు పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు చేశారు. దాదాపు 70 మంది VVIPలు ఇక్కడే ల్యాండ్ అవనున్నారు. ఇక ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే అమృత్‌ సర్‌, ఇండోర్, జైపూర్, లఖ్‌నవూల్లో రిజర్వ్ ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇక మరో కీలక విషయం ఏంటంటే…ఈ సమ్మిట్‌లో డిజిటల్ ఇండియా నినాదాన్ని గట్టిగానే వినిపించనుంది భారత ప్రభుత్వం. Ask Geetha అనే స్పెషల్ యాప్‌ని లాంఛ్ చేసింది. లైఫ్ స్కిల్స్‌కి సంబంధించిన ప్రశ్నలకు ఈ యాప్ సమాధానం చెప్పనుంది. అతిథులకు ప్రత్యేక శాకాహార వంటలు తయారు చేయనున్నారు. బంగారం, వెండి పాత్రల్లో అతిథులకు వడ్డించనున్నారు. వెండి గ్లాస్‌లపై జాతీయ పక్షి అయిన నెమలిని చెక్కించారు. వీటితోనే డ్రింక్స్ అందించనున్నారు

g20-delhi-as-controlled-zone
g20-delhi-as-controlled-zone
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్