Tuesday, May 5, 2026

ఆంధ్రా తిలక్ గా  గాడిచర్ల హరసర్వోత్తమరావు

- Advertisement -

ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్

బుద్ధప్రసాద్ కు గాడిచర్ల ఫౌండేషన్ అవార్డ్ బహుకరణ

ఘనంగా గాడిచర్ల 140 వ జయంతి ఉత్సవాలు

మచిలీపట్నం: సెప్టెంబర్ 14 :  వందేమాతరం ఉద్యమంలో చురుగ్గా పాల్గొనీ అరెస్ట్ కావడం ద్వారా గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రా బాలగంగాధర తిలక్ గా పేరు గడించారు  అని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్  శ్లాఘించారు.  గ్రంథాలయ ఉద్యమ పితామహులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 140 వ జయంతి ఉత్సవాలు సందర్భముగా గాడిచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

gadicharla-harasarvothamrao-as-andhra-tilak
gadicharla-harasarvothamrao-as-andhra-tilak

ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ జాతీయతావాది, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘసంస్కర్త, బహుభాషా కోవిదుడుగా, పాత్రికేయుడుగా,కవిగా, నాటక రచయితగా, రాజకీయవేత్తగా బహుముఖ పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని కొనియాడారు. మహాత్మా గాంధీ స్థిరమైన అనుచరులుగా స్వాతంత్ర ఉద్యమంలో ముందంజలో పాల్గొన్నారని అన్నారు. 1908 లో పూనాలో బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయిన సమయంలోనే బందరులో గాడిచర్ల అరెస్టు కావడంతో ఆంధ్ర తిలక్ గా పేరొందారని అన్నారు. స్వరాజ్య వారపత్రిక నిర్వహించడమే కాకుండా , ఆంధ్ర పత్రిక తొలి ఎడిటర్ గా సేవలు అందించారన్నారు. యంగ్ ఇండియా పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో మహాత్మా గాంధీ హరి సర్వోత్తమరావును ధైర్యశాలిగా కీర్తించారన్నారు. స్వరాజ్య పార్టీ నుండి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కర్నూల్ జిల్లా నుండి ఎన్నికయ్యారు అని పేర్కొన్నారు.

గాడిచర్ల అవార్డు గ్రహీత మండలి బుద్ధ ప్రసాద్ ను గవర్నర్ అభినందించారు

గాడిచర్ల అవార్డు గ్రహీత మాజీ ఉపసభాపతి, రాష్ట్ర తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ మాతృ భాషలో విద్యా విధానం వుండాలి అని ఆనాడే గాడిచర్ల హరిసర్వోత్తమరావు నొక్కి చెప్పారన్నారు. 1908 లో బందరులో ఆయన శిక్షకు గురైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆయన 140 వ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం  ముదావహం అన్నారు. మచిలీపట్నంలో ఆనాడు విద్యాభ్యాసం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి లు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జాతికి దారి చూపే దీప స్తoభంలా కృష్ణా విశ్వవిద్యాలయ విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య కే.హేమ చంద్రారెడ్డి మాట్లాడుతూ 1937 లో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్ ఒప్పందంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు విశేషంగా కృషి చేశారన్నారు. ఆనాడు ఆంధ్ర లో అరెస్ట్ అయిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు అని పేర్కొన్నారు.

గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షులు కె. చంద్రశేఖర కల్కురా అధ్య క్షోపన్యాసం చేస్తూ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ద్వారా ఉత్తేజం పొందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు జాతీయ ఉద్యమంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎం ఏ డిగ్రీ పొందిన రెండో వ్యక్తి గాడిచర్ల అన్నారు. వ్యవసాయ రంగంలో నిరక్షరాస్యులకు ఆనాడే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు.

గాడిచర్ల ఫౌండేషన్ కార్యదర్శి రావి శారద తాడిచర్ల జీవిత విశేషాలు వివరించారు.

తొలుత కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి జ్ఞాన మణి సభాపరిచేయం చేయగా , రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలకు గాను మాజీ ఉపసభాపతి, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు అవార్డును బహూకరించారు.

అనంతరం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అతిథులను ఉపకులపతి ఆచార్య జి జ్ఞాన మణి, రిజిస్ట్రార్ డా. బ్రహ్మచారి లు దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ ప్రశాంతి, కృష్ణా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా బ్రహ్మచారి, రెక్టర్ ఆచార్య సూర్య చంద్ర రావు, జిల్లా అధికారులు, గాడిచర్ల ఫౌండేషన్ సభ్యులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్