- Advertisement -
వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో గఘనంగా పొన్నం జన్మదిన వేడుకలు
కరీంనగర్ మే 09 (వాయిస్ టుడే )రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పొన్నం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వెలిచాల రాజేందర్ రావు తన అనుచరులతో వెళ్లి పుష్పగుచ్చము అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకా మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా రాజేందర్ రావు ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి మంత్రికి తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -