- Advertisement -
గ్యాస్ ట్రబుల్ కు గజ్జి మందిచ్చారు
Gajji Medicine given for gas trouble
రోగికి తీవ్ర ఆస్వస్తత
మెదక్
టెక్మాల్ (మం) ఎలకుర్తిలో పల్లె దవాఖాన సిబ్బంది నిర్వాకం బయటపడింది. వృద్ధురాలు గ్యాస్ ట్రబుల్ ఉందని వెళ్తే గజ్జి,దురదకి సంబంధించిన టానిక్ ఇచ్చారు వైద్య సిబ్బంది. టానిక్ తాగడంతో వృద్ధురాలికి తీవ్ర అస్వస్థత కలిగింది. వాంతులు విరేచనాలతో మెదక్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో వృద్ధురాలు సంగమ్మ(70) చేరింది. ఇప్పటి వరకు 50 వేల రూపాయల వరకు ఆస్పత్రిలో ఖర్చు పెట్టారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు టేక్మాల్ పల్లె దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -