కూకట్ పల్లి :మార్చి 3(వాయిస్ టుడే)
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ లోని ఆంజనేయనగర్ లో బాల తరంగ్ ప్లే ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ నూర్జహాన్ ఆధ్వర్యంలో శ్రీ సీతరామ కల్యాణ మండపం లో యూకేజి కన్వకేషన్ మరియు పదకొండవ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బాలాజీనగర్ కార్పొరేటర్ శిరీష బాబురావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు విచ్చేసి పిల్లల అట పాటలను తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో వారికితగిన స్వేచ్చ ఇవ్వాలని, తమంతట తాము నేర్చుకోనే విధంగా విద్యా బోధనలు, ఆట, పాటలు నేర్పించాలని పిల్లలు మానసికంగా ఎదగడానికి ఆట, పాటలు ఎంతగానో దోహదపడుతాయని వారు అన్నారు.ఈ కార్యక్రమానికి ఆంజనేయ నగర్ అస్సోసియేషన్ సభ్యులు మున్నా,కృష్ణంరాజు, సత్యనారాయణ,ప్రకృతి రామ్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పిల్లలు మానసికంగా ఎదగడానికి ఆట, పాటలు దోహదపడుతాయి.
- Advertisement -
- Advertisement -