బైక్ ల దొంగల ముఠా అరెస్ట్

- Advertisement -
Gang of bike thieves arrested
Gang of bike thieves arrested

అన్నమయ్య: బి కొత్తకోట పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు 31 లక్షల విలువగల 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బి.కొత్తకోట పోలీసులు కాండ్ల మడుగు క్రాస్ సమీపంలో వాహనాల తనిఖీల లో ముఠా పట్టుబడింది. తిరుపతి , పాకాల , కల్లూరు, పుంగనూరు , గుర్రంకొండ , చిత్తూరు, తవణంపల్లి , పీలేరు , బి.కొత్తకోట ప్రాంతాలలో చోరీచేసిన ద్విచక్ర వాహనాలు రికవరీ చేసారు. ఏ1.అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలానికి చెందిన చెన్నూరి ప్రకాష్. ఏ2. నెల్లూరు పట్టణం లోని నవాబుపేటకు చెందిన గణేశం సుబ్బారెడ్డి. ఏ3.అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన ఎం అక్బర్ నిందితులుగా గుర్తించారు.

ద్విచక్ర వాహనాల చోరీ చేసే ముఠాను మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు ఆధ్వర్యంలో, బి కొత్తకోట ఎస్సై రామ్మోహన్ సిబ్బంది పట్టుకున్నారు. బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో  మదనపల్లి డి.ఎస్.పి కేశప్ప వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బి.కొత్తకోట ఎస్సై రామ్మోహన్ మరియు సిబ్బందిని అభినందించి నగదు రివార్డును అందజేసారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular