గంగాధర మండల మాజీ సర్పంచులు మరియు టిఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Gangadhara mandal former sarpanchs and TRS leaders arrested
చొప్పదండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటన సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ లను గంగాధర పోలీస్ స్టేషన్ లో ముందస్తు అరెస్ట్ చేసి ఉంచారు.ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చర్యల పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.రాష్ట్రంలో ప్రజాసామాబద్ధంగా ఎన్నుకోబడిన సర్పంచులు ప్రభుత్వ పనులు చేపట్టి ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించి అప్పులు తీసుకొచ్చి పనులను పూర్తి చేశారని తెలిపారు.ఇప్పుడు ఆ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉండడం వలన పంచల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ముందుగా సర్పంచుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని నిరసన వ్యక్తం చేశారు సర్పంచులు అనేది ప్రజాస్వామ్యబద్ధమైన పదవి అది ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండే పదవి అని సర్పంచులకు పార్టీలకు పనులకు అభివృద్ధికి అంటూ కట్టవద్దని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా ప్రతినిధి ప్రతినిధి అని కావాల్సిన అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు సహకరించాలని కోరారు సర్పంచులకు పార్టీలకు అంటకట్టుతే ఇకనుండి మేము కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.కనుక హామీలపై మేము కూడా విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రజలను చైతన్యపరిచేస్తామని హామీలు నెరవేర్చాలని ప్రతి గ్రామాలలో ఇంటింటా మీ యొక్క మోసాన్ని చెప్పుకుంటూ ప్రజలను ఏకం చేస్తామని గ్రామాలలో కావచ్చు మండలాలలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి తులం బంగారం రైతు భరోసా వడ్లకు బోనస్,ఇంటింటికి మహా లక్ష్మీ పథకమని ఎన్నో హామీలు మోసాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు.గత గడచిన పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ప్రైవేట్ దళారులు ఏ ఒక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని అలాంటి పరిస్థితి తీసుకురాలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఎప్పుడూ చూడని విధంగా నేరుగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి దళారులు వచ్చి వడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇట్లాంటి దుర్భర పరిస్థితిని ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మా బాధ్యతగా ప్రజలకు అండగా నిలుస్తమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మడ్లపల్లి గంగాధర్,మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, మాజీ సర్పంచ్ లు మేఘరాజు, లక్ష్మీరాజం, అలవాల తిరుపతి,సురేందర్, బీ ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సుంకె అనిల్ పలువురు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.