భూకబ్జాలు చేశానా ?
పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా ?
కరీంనగర్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రచారంలో భాగంగా చామనపల్లిలో గంగుల కమలాకర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తనను అవినీతిపరులు అని అన్నాడని నా దగ్గర డబ్బు సంచులున్నయని. అందుకే అధ్యక్ష పదవి నుండి నన్ను తీసేశారట. నేనేమైనా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా ? గంగుల లెక్క గుట్టలు మాయం చేశానా ? భూములు కబ్జా చేసి కమీషన్లు దొబ్బిననా ? నేనెట్లా అవినీతి చేస్తా నని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి తేడా తెలియని మూర్ఖుడు గంగుల అని ధ్వజమెత్తారు. ‘‘నా పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయాలని పంపుతోంది. అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరు. హెలికాప్టర్ ఇవ్వరు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వరు.. మోదీ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెస్తడని తెల్వదా?’’ అని నిలదీశారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగుల కమలాకరేనని అన్నారు. అవినీతిలో తెలంగాణలో కరీంనగర్ టాప్ అని రాష్ట్ర ప్రభుత్వ నిఘా నివేదికలే చెబుతున్నయన్నారు. ’’అవినీతికి పాల్పడుతున్నందుకే గంగులను కరీంనగర్ కే పరిమితం చేసిండు. బి.ఫాం ఇవ్వకుండా సతాయించిండు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని చామన్ పల్లి గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తిలకం దిద్ది కొందరు, పూలు చల్లి కొందరు, శాలువా కప్పి ఇంకొందరు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.
నన్ను ఎంపీగా గెలిపిస్తే…. రోజు మీకోసం కొట్లాడిన. తెలంగాణ మొత్తం తిరిగి పేదల కోసం కోట్లాడిన. జైలుకు పోయిన. కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏందో తెలుసా… 74 కేసులు నామీద పెట్టిండని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేయిస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని ప్రజలను కట్టివ్వలేదు. ఆ ఇండ్లు కట్టిస్తే, తెలంగాణకు మరో 5 లక్షల ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదు. నేను వస్తుంటే, తీగలగుట్టపల్లి బ్రిడ్జి దగ్గర గంటసేపు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న. 10 ఏండ్లుగా అక్కడ జనం ఇబ్బంది పడుతున్నరు. ఆర్వోబీ కట్టాలని అడుగుతున్నా ఏనాడూ గంగుల పట్టించుకోలేదు. నేనే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తే ఆర్వోబీ పనులు మొదలైనయని అన్నారు.
నేను చామన్ పల్లికి రాలేదంట. పంట నష్టపోతే ఈ ఊరికి వచ్చి అండగా నిలిచిన. వడ్ల కొనుగోలు టైంలో ఇక్కడికి వచ్చి మీ తరుపున కొట్లాడిన. మరి గంగుల ఈ ఊిరికి ఏం చేసిండు. రేషన్ మంత్రి ఆయనే కదా… ఒక్క సంతకం చేస్తే పేదొళ్లందరికీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిండదా? అంతెందుకు పంట నష్టపోతే కేసీఆర్ ఈ జిల్లాకు వచ్చి పోయిండు కదా… మీ బాబు (కేసీఆర్) వాళ్లకు ఎందుకు సాయం చేయలే? నేను మీకోసం కొట్లాడితే జైలుకు ఎందుక పంపాడు.
స్మార్ట్ సిటీ నిధులు నేను తీసుకొచ్చిన. కరీంనగర్.. వరంగల్ రోడ్డు, కరీంనగర్, జగిత్యాల రోడ్డు నిధులు నేను తీసుకొచ్చిన. ప్రభుత్వాసుపత్రి నిధులు నేను తీసుకొచ్చినా. కానీ వాటన్నింటికీ గంగుల కొబ్బరకాయలు కొడతడు.. నాకు డౌటొస్తుంది.. గంగుల ఏమైనా కొబ్బరికాయల దుకాణం పెట్టిండా? …గంగులకు దమ్ముంటే… నేను చెప్పిన వాటిపై లెక్కలతోసహా చెప్పేందుకు సిద్ధం? ఆయనకు ఉందా అని నిలదీసారు.