- Advertisement -
యువకుడిని కాపాడిన గన్నవరం సిఐ
Gannavaram CI who saved the youthగన్నవరం
గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద ఓయువకుడి ప్రాణాలు గన్నవరం సీఐ శివప్రసాద్ కాపాడారు. నిన్న జరిగిన ప్రమాదం వద్దే ఈ సంఘటన జరిగింది. కేసరపల్లి నుండి కంకిపాడు వెళ్ళే రహదారిలో బుడమేరు వరద ఉధృతి పరిశీలించేందుకు సీఐ శివప్రసాద్ వచ్చారు. అదే సమయంలో కంకిపాడు వెళ్లేందుకు యువకుడుబైక్ పై వచ్చాడు. బుడమేరు ప్రమాదంగా ఉంది వెళ్లవద్దని సిఐ హెచ్చరించారు. మాట వినకుండా వెళుతున్న యువకుడిని వెంబడించారు. కిలోమీటర్ మేర వెంబడించి యువకుడిని పట్టుకున్నారు. సీఐ వెంటనే స్పందించడంతో బుడమేరులో కొట్టుకుపోయే ప్రమాదం తప్పింది.
- Advertisement -




