Sunday, January 25, 2026

పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా

- Advertisement -

పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా
Gen Z vlogger Swathi Roja meets Pawan Kalyan
గుంటూరు, డిసెంబర్ 22, (న్యూస్ పల్స్)
దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ఆమె చేస్తున్న సాహన యాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ యాత్రలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా కొద్ది వారాల క్రితం ఆమె శ్రీశైలంలో పర్యటించినప్పుడు వసతి, భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు శ్రీశైలంతోపాటు, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పవన్ కల్యాణ్ ని కలిసి.. ఆయన చూపిన శ్రద్దకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలంలో గతంలో ఎదురైన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బైక్ రైడింగ్, బైకులపై తనకున్న ఆసక్తిని పవన్ కల్యాణ్ పంచుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్