Sunday, September 8, 2024

‘కారు’ దిగిపోతున్నారు.

- Advertisement -

బీఆర్ఎస్కు మరో భారీ షాక్
మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం
హైదరాబాద్
బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగిపోతున్నారు. హస్తం గూటికి చేరుతున్నారు.
అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు రేవంత్ కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా.. 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రె్సకు ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరఫునే ఉంటారు. మొత్తం 8 మంది అవుతారు. తాజాగా ఆరుగురు చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రె్సకే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రె్సకు మరో ఐదారు సీట్లు ఉంటే మెజారిటీ దక్కుతుంది. బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ఎ్సతో కలిసి పనిచేసే అవకాశం లేదు. అప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కారుకు ఊరట లభిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్