ఏ ఎస్ఐ పేరుతో ఘరానా మోసం
Gharana fraud in the name of ASI
60000 మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి
హైదరాబాద్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నేను ఎ ఎస్ఐగా పనిచేస్తున్నాను అని నాకు ఎమర్జెన్సీగా 60,000 కావాలని ఫోన్ పే చేయమని నేను తమరికి క్యాష్ ఇస్తాను అని నమ్మబలికి ఫోన్ లోనే ఫోన్ పే చేయించు కొని తీరా సమయానికి ఫోన్ స్విచాఫ్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది ఈ మోసానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు గూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాకు ఏ ఎస్ఐ అని చెప్పి నా వద్ద డబ్బులు ఫోన్ పే చేయించుకోవడం జరిగిందని ఎవరు అని ఏ ఎస్ఐ ని అడిగేసరికి ఇక్కడ ఏ ఎస్ఐ అలాంటి నంబర్ గల వ్యక్తులు ఎవరు లేరని చెప్పడంతో మోసపోయినట్లు నిర్ధారణ అయింది ఆ సదరు ఉపాధ్యాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.