ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంటికి జీహెచ్‌ఎంసీ నోటీసులు..

- Advertisement -

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంటికి జీహెచ్‌ఎంసీ నోటీసులు..

GHMC notices to famous producer Allu Aravind's house..

హైదరాబాద్:సెప్టెంబర్ 09
ప్రముఖ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కు జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని అల్లు అరవింద్ బిజినెస్ పార్క్‌’ పేరుతో ఒక భవనం నిర్మించారు. నాలుగు అంతస్తుల వరకు జిహెచ్ఎంసి నుంచి అను మతులు తీసుకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం అదనంగా పెంట్ హౌస్ నిర్మించడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.

జూబ్లీహిల్స్‌లోని ఆయనకు సంబంధించిన వాణిజ్య భవనంపై అనుమతులు లేకుండా పెంట్‌హౌస్ నిర్మించడమే ఇందుకు కారణం. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు.

అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సుమారు వెయ్యి గజాల స్థలంలో ‘అల్లు బిజినెస్ పార్క్’ పేరుతో ఒక వాణిజ్య భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తుల నిర్మాణానికి ఆయన జీహెచ్‌ఎంసీ నుంచి అధికారికంగా అనుమతు లు పొందారు. ఈ భవనం నిర్మాణం సుమారు ఏడాది క్రితమే పూర్తయింది.

అయితే, ఇటీవల ఈ భవనంపైన నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఒక పెంట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ పెంట్‌హౌస్‌ను అక్రమ నిర్మాణంగా పరిగణించి, సోమవారం అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular