- Advertisement -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసి అధికారి
హైదరాబాద్
GHMC officer in ACB trap
శేరిలింగంపల్లి జీహెచ్ఎంసి జోనల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిపింది. జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ గది సోదాలు జరిగాయి. డిప్యూటీ డైరెక్టర్ వుప్పెర్ల శ్రీనివాస్ చంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయాడు. చార్మినార్ జోన్ కు సంభందించిన ఒక పనిలో బిల్లు మంజూరుకు అయన లంచం డిమాండ్ చేసాడు. మంగళవారం ఆ లంచం నగదు తీసుకుంటున్నప్పుడు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు.
- Advertisement -