- Advertisement -
అవకాశమివ్వండి.. ప్రజల కష్టాలు తీరుస్తా
: కేఏ పాల్
విశాఖపట్నం
కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. అవకాశమివ్వండి. ప్రజల కష్టాలు తీరుస్తానని అన్నారు. ముద్రగడ పద్మనాభం పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు. ‘రెండు కుటుంబాలు, రెండు పార్టీలే ఏపీని ఏలాలా ? బహుజనుల పార్టీ అయిన మాకు అవకాశం ఇవ్వండి. ప్రజల కష్టాలు తీరుస్తా. ఉచిత వైద్యం,విద్య అందిస్తాను. ఏపిని అభివృద్ధి చేస్తా. స్టీల్ ప్లాంటు కారుచౌకగా అదానీకి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను’ అని అన్నారు.
- Advertisement -



