గిరిజన కోటలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించండి
Give an opportunity as an MLC in a tribal stronghold
టిపిసిసి ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య
మహబూబాబాద్,
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాయకులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మనిషి లకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా రాయపురం సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లల లో ఏకలవ్య సామాజిక వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతున్నందున అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించడం జరిగిందని తెలుపుతూ, టిక్కెట్ రాకపోయినా పార్టీ ఆదేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తూనే, పార్టీ కార్యకర్తలతో, నా అభిమానులతో కలిసి పార్టీ బలోపేతం చేస్తూనే, పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కొరకు కష్టపడి పని చేసానూ, నిత్యం ప్రజలలో ఉంటూ పార్టీ ఇచ్చే కార్య క్రమాలను, ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. నాలాంటి సామాజిక వర్గానికి కనీసం ఎమ్మెల్సీగా నైనా అవకాశం కల్పించి మా గొంతును చట్ట సభలలో వినిపించే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సామాజిక వర్గం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన ఏకలవ్య సామాజిక వర్గానికి చెందిన నాకు అవకాశం కల్పించడం వలన సామాజిక న్యాయం పాటించిన వారవుతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన కోసం చేస్తున్న కృషిలో భాగంగా నైనా నాలాంటి వారిని గుర్తించాలని మా గొంతును మా వేదనను చట్ట సభల్లో వినిపించే విధంగా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను, మీడియా మిత్రులను, పార్టీ కార్య కర్తలను, నాయకులను, కుల సంఘాలు, మనస్ఫూర్తి గా సహకరించ వలసిందిగా కోరుతున్నానని అన్నారు .