- Advertisement -

బీఎస్పీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి…
కమాన్ పూర్: తనకు అవకాశం ఇస్తే మంథనియోగ వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కమాన్ పూర్ మండలంలోని రొంపిగుంట నాగారం తదితర గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బి ఆర్ ఎస్ అధికారంలో ఉండగా మంథని నియోజకవర్గం వెనుకబడిపోయిందని తనకు అవకాశం ఇస్తే మంథని నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలు ఏనుగు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
- Advertisement -



