గోషామహల్ బిఆర్ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోషామహల్ : నవంబర్ 01 ( వాయిస్ టుడే ): తనకు ఒక అవకాశం ఇస్తే గోషామహల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని గోషామహల్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరారు. గత 35 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అనుభందం ఉందని… వారికి ఏదైనా సమస్య వస్తే ముందు తాను వెళ్లి పరిష్కరిచేవాడినని అన్నారు. 2016 ఎన్నికల్లో జాంబాగ్ డివిజన్ నుండి కేవలం 5 ఓట్ల తేడా తో ఓటమి చెందనని… 2018 నాంపల్లి టికెట్ తనకు కేటాయిస్తే రెండు నెలలు ప్రచారం కూడా చేసినట్లు తెలిపారు. అనంతరం వేరే వారికి టికెట్ కేటాయించిన పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ , గోషామహల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలుపు కోసం పని చేశానని గుర్తు చేశారు. ఇన్నేళ్ళుగా పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆనంద్ కుమార్ గౌడ్ కోరారు. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ దందాలు మొత్తం తనకు తెలుసునని… తనకు అవకాశం ఇస్తే అతన్ని ప్రజల ముందు నిలదీస్తానని వివరించారు. అధిష్ఠాన నిర్ణయాన్ని తాను పటిస్తానని… తనకు అవకాశం ఇస్తే గోషామహల్ లో బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.


