Saturday, March 14, 2026

ప్రజలు అర్థం చేసుకుని కాస్త టైం ఇవ్వండి

- Advertisement -

ప్రజలు అర్థం చేసుకుని కాస్త టైం ఇవ్వండి
ఆగస్టు 15 న అన్నక్యాంటీన్లు పున:ప్రారంభం
నెల్లూరు

Give some time for people to understand

ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు టిడిపి ప్రభుత్వానికి ప్రజలు కాస్త టైం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ సమస్య ఉన్న తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. పెన్షన్ దారులను పేరుపేరునా పలకరిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న 4000 రూపాయల పెన్షన్ను వృద్ధులకు, 6000 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు అందజేశారు. జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో కలిసి 48వ డివిజన్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును మంత్రి నారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ… తనదైన శైలిలో వైసిపి ప్రభుత్వ అసమర్థ పాలనపై ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గాడి తప్పిన పరిపాలనను టిడిపి ప్రభుత్వం వచ్చాక సరిచేస్తున్నామని అయితే ప్రజలు ఇందుకు కాస్త టైం ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతగా పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే పెన్షన్ల పెంపు అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతినెల 1వ తేదీ తెల్లవారుజాము నుండే రాష్ట్రంలో 68 లక్షల 64 వేల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. వృద్ధులకు రూ.3వేల నుండి రూ.4 వేలు, దివ్యాంగులకు 3000 నుండి 6000 రూపాయలకు, అత్యధికంగా 15 వేల రూపాయల వరకు పెన్షన్ పెంచి ఇస్తున్నామని చెప్పారు. ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడమే కాదు అప్పులు చేసి పెట్టిందని ఘాటుగా విమర్శించారు. దీంతో ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయని… ప్రభుత్వ భవనాలను సైతం తాకట్టు పెట్టిన దౌర్భాగ్యపు పాలన గత ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరగాలని… పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ శాఖలోని ప్రజల కట్టిన పన్నులు డబ్బులన్నిటినీ గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు వాడేశారని మండిపడ్డారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మురిగిపోయాయన్నారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు మంత్రులను కేంద్రం నుంచి వచ్చే నిధులు కోసం పరుగులు పెట్టించేవారని తెలియజేశారు. ఆగస్టు మొదటి తారీకు నుండి రాష్ట్రంలో కనీసం 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఆగస్టు నెలాఖరుకు అంతా 203 అన్నా క్యాంటీన్లను పూర్తిస్థాయిలో పునఃప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి కాస్త టైమ్ ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టి సమర్థవంతమైన ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నారాయణ ప్రశంసించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్