Sunday, September 8, 2024

అమ్మాయిలకు  సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ…  

- Advertisement -
Giving chance to girls in movies...
Giving chance to girls in movies…

హైదరాబాద్, ఆగస్టు 14:  హైదరాబాద్‌లోని మణికొండ సమీపంలో ఉండే ల్యాంకోహిల్స్.. ఎల్లుప్పుడు రక్షణగా ఉండే భద్రతా సిబ్బంది. చుట్టూ సీసీటీవీకెమెరాలు, ఇంతటి రక్షణ చర్యలున్నప్పటికీ కూడా లోపల జరుగుతున్న దారుణాల స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిరోజు వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా మణికొమడ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్‌లో బిందుశ్రీ (28) అనే యువతి 21 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వేధింపులే అని పోలీసుల విచారణలో తేలింది. వ్యాపారవేత్త, కన్నడ నటుడు అయినటువంటి ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్‌రావు అనే వ్యక్తి కొన్ని కన్నడ సినిమాల్లో యాక్ట్ చేశాడు. పది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండలోని ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్స్ లో తన భార్య, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు కేర్ టేకర్‌గా పదేళ్ల నుంచి కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అలాగే అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 5 రోజుల క్రితం పుర్ణచంద్‌రావు తన కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తెచ్చాడు. దీంతో శుక్రవారం రోజున గొడవలు పెరిగిపోయాయి. ఆ తర్వాత బిందుశ్రీ 21వ అంతస్తు పైనుంచి దూకింది. సెక్యూరిటీ వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పనిమనిషి ఆత్మహత్య జరిగిన తర్వాత పూర్ణచంద్‌కు ఈ విషయం చెప్పేందుకు అతడి ఫ్లాట్‌కు వెళ్తే సుమారు అరగంట తర్వాత అతను తలుపులు తీయడంతో పోలీసులు షాక్ అయ్యారు.ఇదిలా ఉండగా కన్నడ సినిమాల్లో నటించినట్లు పూర్ణచంద్ ప్రచారం చేసుకునేవాడు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ అమ్మాయిలకు ఆశ చూపేవాడని స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తరచుగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవడం కూడా అనుమానస్పదంగా తిరగడం గమనించినట్లు అక్కడ ఉంటున్న కొంతమంది తెలిపారు. ఈ ఘటన జరగడానికి 3 రోజుల ముందు నలుగురు యువతులు అతని ఫ్లాట్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. మొదట బిందుశ్రీ మరణం అనుమానస్పదంగా భావించిన పోలీసులు వేధింపులు కారణంగానే చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్