గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ అమెరికా మహాసభ సన్నాహాక సమావేశం* –

- Advertisement -

 గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ అమెరికా మహాసభ సన్నాహాక సమావేశం* –

పాల్గొన్న ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రులు గంగుల, పొన్నాల,జోగు

Global Munnurukapu Association General Assembly Preparatory Meeting

మున్నూరుకాపులం ఐకమత్యంతో ముందుకు సాగతూ అన్ని రంగాలలో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రము ఖులు చెప్పారు.గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ (జీఏంఏ)ప్రప్రథమ మహాసభ ఆగస్ట్ 30,31వతేదీలలో అమెరికాలో జరుగుతుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ టూరిజం ప్లాజాలో ఆదివారం రాత్రి సన్నాహాక సమావేశం ఏర్పాటైంది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,విద్యా,ఉద్యోగ రంగాలలో మనం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.జనాభా దామాషా ప్రకారం చూస్తే రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నట్లేనని, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారన్నారు.మున్నూరుకాపులకు మంత్రివర్గంలో మొట్టమొదటి సారి ప్రాతినిథ్యం లేకుండా పోయిందని,ఇది తీవ్ర విచారకరమన్నారు.అమెరికాలో జరిగే మహాసభకు తాను కూడా హాజరవుతానని,ఇది తప్పక విజయవంతమవుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.అవసరమైన ప్రతి సందర్భంలో మనమందరం మరింత ఐక్యత ప్రదర్శిస్తూ అన్ని రంగాలలో ఎదగాల్సిన అవసరం ఉందని ఎంపీ వద్దిరాజు అన్నారు.సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మున్నూరుకాపులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా కూడా బాగా ఎదిగి రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని, తెలంగాణలో ఇంకా రాణించాల్సిన అవసరం ఉందన్నారు.అమెరికాలో జరిగే మహాసభకు తాను కూడా హాజరై విజయవంతం కావడానికి సహకరిస్తానని ఎమ్మెల్యే గంగుల చెప్పారు.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, తాను 57ఏండ్ల కిందటే అమెరికా వెళ్లడం జరిగిందని, అప్పుడు మన తెలంగాణ నుంచి అతి కొద్ది మంది మాత్రమే అక్కడ కనిపించే వారని తెలిపారు.మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ,మున్నూరు కాపు నాయకులం ఈవిధంగా తరుచూ సమావేశమవుతూ మరింత ఐకమత్యాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.కొండా దేవయ్య మాట్లాడుతూ,మనమంతా ఒకే కులం ఒకే సంఘంగా ఐకమత్యంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 30మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే దిశగా ముందుకు సాగుదామన్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,జాజాల సురేందర్,మున్నూరుకాపు ప్రముఖులు చందు జనార్థన్,కొత్త లక్ష్మణ్,సామల వేణు,కొనగాల మహేష్,రుద్ర సంతోష్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు ప్రసంగించారు.అమెరికాలోని లీస్ బర్గ్ లో ఆగస్ట్ 30,31వతేదీలలో జరిగే మహాసభకు హాజరు కావలసిందిగా జీఏంఏ కన్వీనర్ సంగని రజనీకాంత్, నాయకులు రామసాని వెంకట శ్రీనివాసరావు (ఖతర్), శ్రీధర్ (బోట్స్ వాన)లు మున్నూరుకాపు ప్రముఖులను ఆహ్వానించారు.సమావేశంలోరజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ చేసి శాలువాతో సత్కరించారు.సమావేశంలో మున్నూరుకాపు ప్రముఖులు చల్లా హరిశంకర్,ఊసా రఘు, లవంగాల అనిల్,జే.వెంకటేశ్వర రావు (జేవీఆర్),బాదినేని రాజేందర్, బాజిరెడ్డి జగన్మోహన్,యడవెల్లి నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular