Friday, December 12, 2025

గాంధీ తాత చెట్టు’ టీమ్‌ను అభినందించిన గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన

- Advertisement -

గాంధీ తాత చెట్టు’ టీమ్‌ను అభినందించిన గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఉపాసన

Global star Ram Charan congratulated the team of 'Gandhi Tata Chettu', Upasana

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ విడుదల చేశారు మేకర్స్‌. కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్‌ పట్ల రామ్‌చరణ్‌, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్‌, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్‌, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్