కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

- Advertisement -

కాణిపాకంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

Glorious Brahmotsavams in Kanipakam

చిత్తూరు
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అణివేటి మండపంలోని ధ్వజ స్తంభాన్ని అభిషేకించారు. అనుజ్ఞ, గణపతిపూజ, మృత్‌ సంగ్రహణం, వాస్తుశాంతి, నవసంధి బలి, పుణ్యహవచనం, మూషిక యాగం, ధ్వజపటపూజ వేదమంత్రాల నడుమ మూషిక ధ్వజ పటాన్ని నింగికి ఎగుర వేశారు.దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలను కామికా ఆవాహన పద్ధతిలో నిర్వహిస్తారు. సాయంత్రం అర్చక, పండితులు యాగశాల ప్రవేశ పూజ నిర్వహించారు. యాగశాలలో ఈవో గురుప్రసాద్‌కు, అనంతరం ధ్వజస్తంభానికి, మూషికానికి అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌ రక్షా బంధనాన్ని కట్టారు. దీనివల్ల బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని ప్రజల నమ్మకం. రక్షా బంధనం కట్టున్న వ్యక్తి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ఊరి పొలిమేర దాటి వెళ్లకూడదని నియమంగా పాటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular