Sunday, September 8, 2024

టూ టైర్ సిటీస్ కు గ`మ్మత్తు…`

- Advertisement -

టూ టైర్ సిటీస్ కు గ`మ్మత్తు…`
కరీంనగర్, జూలై 8,
మత్తు గమ్మత్తుగా మారింది.‌ గంజాయి గుప్పుమంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువత గంజాయి మత్తులో జోగుతోంది. ఎక్కడ చూసిన గంజాయి విక్రయాలు యధేచ్చగా సాగుతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు.. ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుతున్నాయి. పోలీసుల కళ్లు గప్పి స్మగ్లర్లు గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు, యువకులు గంజాయి బారిన పడి మత్తులో ఊగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మహమ్మారిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా పెంచారు.ఉమ్మడి జిల్లాలో గంజాయి అక్రమ వ్యాపారం దర్జాగా సాగుతోంది. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన యువత ఈ గంజాయి మత్తు బారిన పడి చిత్తవుతున్నది. రోజురోజుకు గంజాయి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పోలీసు యంత్రాంగం నిత్యం దాడులు నిర్వహిస్తూ.. యువత, మైనర్లకు కౌన్సిలింగ్ ఇస్తూ తల్లిదండ్రులను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నా దందా మాత్రం ఆగడం లేదు. పేద, మధ్య తరగతి యువతను ఆకర్షించి మత్తులో దింపి వారిచే మరికొందరిని ఆకర్షించడం ద్వారా గంజాయి విక్రయాలను గణనీయంగా పెంచుకుంటున్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు కూడా ఇప్పుడు గంజాయి బారిన పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఇటు తల్లిదండ్రులు.. అటు పోలీసు వర్గాలు కలవరపడుతున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఒకవైపు పోలీసు యంత్రాంగం నిరంతరం తలమునకలవుతుంటే.. కొత్త కొత్త మార్గాల్లో సరికొత్త రూపాల్లో గంజాయిని జిల్లాలోకి తరలిస్తూ వ్యాపారులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గంజాయి రవాణా విపరీతంగా పెరిగింది. కరీంనగర్ తో పాటు, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో యథేచ్చగా గంజాయి లభిస్తోందని తెలుస్తోంది. వివిధ మార్గాల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. జగిత్యాలలో ఎక్కడ పడితే అక్కడ గంజాయిని సరఫరా చేస్తున్నారు. పోలీసులు నిరంతరం దాడులు చేస్తూ పట్టుకున్నారు. ఇటీవల కాలంలో గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కరీంనగర్ లో కూడా వివిధ ప్రాం తాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. నగరం… నడిబొడ్డున ఈ దందా దర్జాగా కొనసాగుతోంది.. కట్టారాంపూర్ లోని ఓ మైదానంలో నిత్యం గంజాయిని సేవిస్తున్నారు. అదే విధంగా ఆదర్శనగర్, సుభాష్ నగర్, మారుతీనగర్, విద్యానగర్ ఖాళీ ప్రాంతాల్లో గంజాయిని పిల్చుతున్నారు. నగర శివారులో ప్రొఫెషనల్ విద్యార్థులు ఈ మత్తుకు అలవాటుపడుతున్నారని తెలుస్తోంది. చిగురు మామిడి మండలంలో సుందరగిరి గ్రామ శివారులో గంజాయి మత్తులో యువకులు ఓ వ్యక్తి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మత్తులో బీరు సీసాతో దాడి చేసి కటకటాలపాలయ్యారు.సరదా కోసమే.. స్నేహితుల ఒత్తిడి కోసమే ఒక్క సారిగా గంజాయి సేవిస్తే మత్తుకు పూర్తిగా అలవాటు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఎల్ఎండి శివారులో గంజాయి తాగుతున్నారు. గతంలో గంజాయి మత్తులో వివిధ నేరాలకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. కొంత మంది మైనర్లు కూడా ఈ గంజాయికి అలవాటు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నగర శివారులో పోలీసులు పెట్రోలింగ్ ను పెంచారు… గతంలో గంజాయి సేవించి దొరికిన యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీసులు… వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.. అయితే.. ఏ చిన్న అనుమానం వచ్చినా, తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. అదే విధంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఈ మత్తు నుంచి ముక్తి చేయడానికి అవగాహన కల్పిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న గంజాయి రవాణా, సమాజంపై తీవ్రప్రభావం చూపుతోంది. యువత చెడిపోతుంది… ఈ విషయంలో.. ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.రాష్ట్ర సరిహద్దు నుంచి యథేచ్ఛగా గంజాయి రవాణా అవుతుంది. కొంతమంది గంజాయి రవాణాను వ్యాపారంగా మార్చుకొని లక్షలు సంపాదిస్తున్నారు. చెక్ పోస్ట్ అధికారుల కళ్లు గప్పి రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత జిల్లాల వారీగా గంజాయిని వివిధ రూపాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా గంజాయి సాగు కాకున్నా, ఒడిశా, ఏపీ, చతీష్ గడ్ నుంచి రవాణా అవుతుందని తెలుస్తోంది. మత్తుకు అలవాటు పడిన వారి జాబితా ముందే సేకరించి ఉండటంతో ఒక్కో ప్రాంతంలో ఏ మేరకు గంజాయి అమ్మకాలకు డిమాండ్ ఉందో గుర్తించి ఆ మేరకు సరఫరా చేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నారు. చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయిస్తు వేములవాడలో ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్టు అయ్యారు. ఇటీవల కరీంనగర్ శివారులో 70 కిలోల గంజాయిను పట్టుకున్నారు. అలాగే సిరిసిల్లలో 4 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. జగిత్యాలలో మైనర్లు గంజాయికి అలవాటు పడితే.. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ మత్తు కారణంగా నేరాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, దాడులు చేస్తున్నారు. గంజాయి సేవించిన వారు నేరాలకు పాల్పడుతున్నారని.. పోలీసులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లోనే అధికంగా ఈ మత్తును సేవిస్తున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మత్తుకు క్రమేపీ యువకులు అలవాటు పడుతున్నారు. ఇప్పుడు సామాజిక సమస్యగా మారింది.. ప్రభుత్వం సత్వరమే స్పందించి.. గంజాయి నివారణకు కఠిన చర్యలు. తీసుకోవాలని స్వచంద సంస్థలు కోరుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్