Friday, February 27, 2026

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల సంగతి దేవుడెరుగు.. ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారు  :మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం

- Advertisement -

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల సంగతి దేవుడెరుగు.. ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారు
                                 మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం
హైదరాబాద్ ఫిబ్రవరి 3

God knows about integrated schools.. they have worsened the condition of existing Gurukuls
Former Minister Harish Rao is angry
ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల సంగతి దేవుడెరుగు.. ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారని మాజీ మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. పాము కాటుకు గురై ఆస్పత్రిలో చేరిన గురుకుల విద్యార్థిని ప్రాణానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌ రెడ్డిదేనని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. విద్యార్థిని పాము కాటుకు గురైన వార్త తనను ఎంతో కలిచివేస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి గారు మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా..? లేదంటే విషసర్పాలకు ఆవాసాలా..? అని హరీష్‌ రావు ప్రశ్నించారు.సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా…? రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్ అని చెబుతూ రంగుల లోకం చూపిస్తూ గురుకులాలను మీరు గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కులేదు. చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు. అపరిశుభ్రత కారణంగా గురుకులాల్లో నేడు కుక్కకాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు.గురుకుల బిడ్డలకు కడుపునిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదన్నారు. సీఎం హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫొటోలకు పోజులిస్తే ఇక్కడ పేద విద్యార్థులు ఆస్పత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా..? లేక చావుతో పోరాడేందుకు వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి. రాజకీయ కక్షసాధింపుల మీదున్న శ్రద్ధలో కొంతైనా పేద పిల్లల బతుకుపై పెట్టండని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్