నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు.. బాలాత్రిపురసుందరిగా దుర్గమ్మ తొలి దర్శనం
దుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాలతో అలంకారం
Goddess Durga is adorned with special auspicious threads.
విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి.

దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్తారు. మూల విరాట్తో పాటు కల్యాణమూర్తులకు కూడా వీటితోనే అలంకరిస్తారు. సాధారణంగా బ్యాంకు లాకరులో భద్రపరిచే ఈ మంగళసూత్రాలను ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. దసరా సందర్భంగా దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమివ్వగా, ఒక్కో అలంకారానికి అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలు, మంగళసూత్రాలు ధరిస్తారు
తొలిరోజు బాలాత్రిపురసుందరిగా దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ
భక్తుల భద్రత కోసం ఈ ఏడాది సరికొత్త ఫ్రేమ్ మోడల్ క్యూలైన్లు
క్యూలైన్లలో ప్రతి 50 మీటర్లకు అత్యవసర ద్వారాల ఏర్పాటు
రూ. 500 దర్శన టికెట్ రద్దు.. 6 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
భక్తుల సౌకర్యార్థం రథం సెంటర్ వద్ద కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి



