అర్హత కలిగిన వారికే గోకులం షెడ్లు మంజూరు చేయాలి
Gokulam sheds should be granted to those who are eligibleప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలి
* సిపిఐ తుగ్గలి మండల కార్యదర్శి సుల్తాన్
తుగ్గలి
మండల పరిధిలో అర్హత కలిగిన వారికే గోకులం షెడ్లను మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్ తెలియజేశారు.శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా తీసుకొని,ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా గోకులం షెడ్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఆయన తెలియజేశారు. మండల వ్యాప్తంగా 72 గోకులం షెడ్లు మంజూరయ్యాయని వాటిని అర్హత కలిగిన వారికే మంజూరు చేయాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా ప్రభుత్వం విడుదల చేసిన పథకాలు ఏవైనా అర్హత కలిగిన వారికే మంజూరు చేస్తే నిజమైన లబ్ధిదారులు పథకాలను పొందుతారని ఆయన తెలియజేశారు. నిరుపేదల కొరకు ప్రవేశపెట్టే పథకాలను వారికే చెందేలా ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్ తెలియజేశారు.




