కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Gold and silver prices have collapsed.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా కుప్పకూలాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇండియా బులియన్స్ వెబ్సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ. 2.47 లక్షలకు పడిపోగా, 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ. 1.52 లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడటం వంటి కారణాలతో ఈ పతనం చోటుచేసుకుంది. రెండు రోజులుగా లాభాల్లో పయనించిన వెండి, గురువారం నాటి మార్కెట్ క్రాష్ తర్వాత కోలుకోలేకపోయింది. స్పాట్ మార్కెట్లో వెండి ధర ఏకంగా 20 శాతం పతనమై ఔన్సుకు 71 డాలర్ల దిగువకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా రూ. 26,850 (10శాతం) తగ్గి కిలో రూ. 2,42,000 వద్ద ట్రేడ్ అయింది.



