Wednesday, February 11, 2026

 పెరిగిన బంగారం, వెండి ధరలు…

- Advertisement -

పెరిగిన బంగారం, వెండి ధరలు…
హైదరాబాద్‌లో తులం బంగారం రూ.1,60,000
హైదరాబాద్, ఫిబ్రవరి 9

Gold and silver prices increased…
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,000, వెండి కిలో ధర రూ.2,70,000 వద్ద ఉన్నాయి. ఖరీదైన ఈ లోహాల ధరలు ఇటీవల భారీ దిద్దుబాటుకు గురయ్యాయి. బంగారం ధరలు రూ.1,80,000 నుంచి భారీగా పతనమై తర్వాత కాస్త కోలుకుంది. వెండి ధర అయితే దాదాపు సగం పతనమైంది. దీంతో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.దీనికి ఇటీవల డాలర్ పతనం కావడం కూడా కారణమని చెబుతున్నారు. చైనా సెంట్రల్ బ్యాంకు వరుసగా 15వ నెల కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడంతో డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారు. ఈ వారం వెలువడనున్న అమెరికా ఉద్యోగ, ద్రవ్యోల్భణ గణాంకాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి దాదాపు 5 శాతం పెరిగింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ రూ.11,000 పెరిగి రూ.2,61,745 పలికింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2 వేలు పెరిగి రూ.1,57,540 పలికింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం రూ.5 వేల మార్కు దాటింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్