Wednesday, March 25, 2026

దేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

- Advertisement -

దేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు
హైదరాబాద్ మార్చ్ 25

Gold prices in the country are consistently on a downward trend.
;దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,350గా ఉంది. ఇంతకుముందు రోజు రూ.14,32,90 ఉంది. అంటే ఒక్క రోజులోనే రూ.2,940 వరకు తగ్గింది. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, రూపాయి విలువ తగ్గడం, డాలర్ బలపడటం వంటి కారణాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి.ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. ఈ నెలలోనే బంగారం ధరలు దాదాపు 19.52 శాతం పడిపోయాయి. 1975 తర్వాత ఒక నెలలో ఈ స్థాయిలో బంగారం ధరలు పతనమవ్వడం ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 4,263 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,350, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,777, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,544గా ఉంది.ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 14,1820, 22 క్యారెట్ల ధర రూ. 1,30,000, 18 క్యారెట్ల ధర రూ. 10,82,00, ముంబైలో ముంబై.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 14,0350, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 12,8650, 18 క్యారెట్ల బంగానం ధర రూ. 10,5260, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 14,0350, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 12,8650, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 10,526, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.14,0350, 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,86,50, 18 క్యారెట్లు బంగారం ధర రూ10,52,60. వెండి కిలో ధర రూ.2,18,348గా ఉంది. నిన్నటితో పోలిస్తే దాదాపు 3.03 శాతం పతనమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్