మళ్లీ పెరుగుతున్న బంగారం

- Advertisement -

మళ్లీ పెరుగుతున్న బంగారం

Gold Rising Again
బంగారం ధర మళ్లీ ఆకాశాన్నంటుతోంది. గతవారం దాదాపు రూ.15 వేల వరకూ తగ్గిన గోల్డ్ రేటు.. ఈవారం క్రమంగా పెరుగుతూ వస్తోంది. బుధవారం ఉదయం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై

రూ.1970 పెరిగి..    లక్షా 51 వేల 480 రూపాయలకకి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1800 పెరిగి రూ. లక్షా 38 వేల 850కి ఎగబాకింది. గడిచిన 5 రోజుల్లో బంగారం ధర రూ.6350 నుంచి రూ.6930

వరకూ పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ.15,000 పెరిగి.. రూ.2,65,000కి చేరింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, ప్రస్తుతం బంగారం, వెండికి డిమాండ్ పెరగడం, వాటిపై

పెట్టుబడులే సేఫ్ అని ఇన్వెస్టర్లు భావిస్తుండటంతో ఈ రెండు లోహాల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా.. శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి పెరుగుతున్న

ధరలు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు బంగారం ధరలు గుదిబండగా మారుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular