హెయిర్ క్లిప్ లో బంగారం హైదరాబాద్, ఆగస్టు 22: ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఇవాళ సీజ్ చేశారు.. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు..గత ఏడాది లో కూడా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. గత ఏడాది ఆగస్టు 14న రూ. 13.63 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. లో దుస్తుల్లో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు ప్రయాణీకుడిని అడ్డుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 6 వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీని విలువల రూ. 3.5 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు..అలాగే ఈ ఏడాది కూడా జూలై లో . 1.27 కోట్ల విలువైన 1.93 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. క్యాప్యూల్స్ రూపంలో బంగారాన్ని తీసుకు వచ్చిన ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్రమార్కులు కొత్త మార్గంలో ఈ బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చీరకు బంగారాన్ని స్ప్రే చేసి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఏకంగా జడ క్లిప్ లు, గాజులలో తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు..