సినీపక్కీలో బంగారం చోరీ

- Advertisement -

సినీపక్కీలో బంగారం చోరీ

Gold theft in Sinepakky

నరసాపురం
ఆభరణాల తాకట్టు దుకాణంలో దుండగుడు సినీపక్కీలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబందించి దుకాణ యజమాని, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం టేలరుపేటలో ఉన్న బంగారు ఆభరణాలపై వడ్డీకి అప్పు ఇచ్చే దుకాణానికి సోమవారం సాయంత్రం అగంతుకుడు వచ్చాడు. తాను కుదువపెట్టిన బంగారు ఆభరణాలకు సంబందించి అప్పు తిరిగి చెల్లిస్తానని నమ్మబలికి ఒక వ్యక్తి పేరుచెప్పాడు. ఆ పేరున కుదువపెట్టిన ఆభరణాలను వదిలించుకు వెళ్తానని చెప్పాడు. ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన పేరున తాకట్టు పెట్టిన సుమారు రూ. 2లక్షలు విలువగల 27గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకువచ్చి దుకాణంలో బయట పెట్టాడు. దుండగుడు ఆ ఆభరణాలు తీసుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular