Wednesday, March 11, 2026

లక్షకు చేరిన బంగారం

- Advertisement -

లక్షకు చేరిన బంగారం
హైదరాబాద్, ఏప్రిల్ 22, (వాయిస్ టుడే)

Gold worth Rs. 1 lakh

అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో ప్రజలు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కారణంగా ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో తొలిసారిగా బంగారం 24 క్యారెట్ల ధర రూ.1 లక్ష రూపాయలు దాటింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధరలో 25 శాతం వరకు పెరుగుదల కనిపించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ విధానం, బలహీనపడుతున్న డాలర్, ఆర్థిక మాంద్యం భయాల కారణంగా బంగారం ధరలు ఊహించిన విధంగా పెరుగుతున్నాయి.  బంగారం ధరల భగభగలు తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం రూ.లక్ష దాటిన బంగారం ధర నేడు భారత్‌లోనూ లక్ష మార్క్ చేరుకుంది. దేశంలో పలు నగరాలలో నేటి ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 10 వేలకు పైగా పలికింది. దాంతో 10 గ్రాముల బంగారం ధర పలు నగరాలలో తొలిసారి 1 లక్ష రూపాయల మార్క్ దాటింది. ఒక్క గ్రాముకు 300 పెరగడంతో పది గ్రాముల ధర రూ.3000 పెరిగింది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు

ప్రాంతం పేరు 22 క్యారెట్ల ధర (1 గ్రాము) 24 క్యారెట్ల ధర (1 గ్రాము)
చెన్నై ₹ 9,290 ₹10,135
ముంబయి ₹ 9,290 ₹10,135
పుణె ₹ 9,290 ₹10,135
దిల్లీ ₹ 9,305 ₹10,150
హైదరాబాద్ ₹ 9,290 ₹10,135
కోల్‌కతా ₹ 9,290 ₹10,135
నాగ్‌పుర్‌ ₹ 9,290 ₹10,135
బెంగళూరు ₹ 9,290 ₹10,135
అహ్మదాబాద్ ₹ 9,295 ₹ 10,140
కేరళ ₹ 9,290 ₹10,135
హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలలో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,00,000 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,01,500గా కి చేరింది. హైదరాబాద్‌లో  24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,01,350గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, కేరళలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,350కి చేరింది. భారత్‌లో పలు నగరాలలో కేజీ వెండి ధర రూ.1,01,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కేరళ మినహా అన్ని నగరాలలో వెండి ఇదే ధరలో విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, చెన్నైలలో ఒక కేజీ వెండి ధర రూ.1,11,000 అయింది.అమెరికాలోనూ మంగళవారం బంగారం ధరల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది. ట్రంప్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్‌ను విమర్శించడం,యు వ్యాపారంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున సురక్షిత పెట్టుబడిగా ప్రజలు భావించడంతో బంగారం డిమాండ్ పెరిగింది. ప్రారంభంలో హాజిర్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 3,443.79 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తరువాత, హాజిర్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 3,429.03 డాలర్లుగా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్