
హైదరాబాద్ నవంబర్ 16: మా మద్దతు నీకే..గెలుపు నీదే అన్నా” అంటూ అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ను గోల్నాక డివిజన్ అడబిడ్డలు దీవించారు. గురువారం ఆయన డివిజన్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేయగా, ఏ గల్లీ కి వెళ్లిన తిలకం దిద్ది ఆశీర్వాదాలు అందించారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈసారి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకుంటామని వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్య పార్టీ నాయకులు, మహిళా నేతలు మరియు కార్యకర్తలతో కలిసి గోల్నాక డివిజన్ లోని శాంతి నగర్ లో ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు.ఇందులో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ముందుకి నడిపించారు.తెలంగాణ పురోగతికి కేసీఆర్ గారిని గెలిపించాలని, అలాగే బీఆర్ఎస్ కు ఓటు వేసి అంబర్ పేటలో సంక్షేమాభివృద్ధి కొనసాగించాలని కాలేరు ప్రజలను కోరారు.కారు గుర్తుకు ఓటు వేసి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కాలేరు గారినే గెలిపిస్తామని శాంతి నగర్ ప్రజలు ప్రకటించారు.



