Monday, March 24, 2025

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!!

- Advertisement -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!!
Good news for Telangana RTC employees..!!
_* హైదరాబాద్‌,తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ(Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల భారం పడుతోందన్న ఆయన.. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తోందని తెలిపారు. ఇక.. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని.. దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలియజేశారాయన. ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి అభినందించారు. ఇక.. మహిళా సమైక్య సంఘాల చేత బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి మహిళలు ఆదాయాన్ని అర్జించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో.. రేపు(మార్చి 8వ తేదీన) మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో కలిసి పొన్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్ ,ఖమ్మం ,కరీంనగర్ , మహబూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్య ల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా బస్సుల డిమాండ్ ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్