Tuesday, April 1, 2025

అయోధ్య వెళ్లే వారికి గుడ్ న్యూస్..

- Advertisement -

అయోధ్య వెళ్లే వారికి గుడ్ న్యూస్..

సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక రైళ్లు!
బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ రామ భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది.

అయోధ్య వెళ్లే వారికి గుడ్ న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక రైళ్లు!
రామ జన్మభూమి అయోధ్యలో కోదండ రాముడు కొలువుదీరిండు. జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ్ మందిర్ ను అట్టహాసంగా ప్రారంభించారు. కాగా తాజాగా అయోధ్య బాల రాముడిని పేరును మార్చారు. ఇక నుంచి బాలక్ రామ్ గా పిలవనున్నారు. బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అయోధ్యకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ రామ భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేష్ నుంచి 17 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

అయోధ్యలో బాలక్ రామ్ దర్శనానికి అనుమతించడంతో అయోధ్యకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 17 రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయోధ్యకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే ఏర్పాట్లు చేసింది.

Railway department good news for those going to Ayodhya!

అయోధ్యకు దక్షిణమధ్య రైల్వే ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29 వరకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. మొత్తం 41 ట్రిప్పులు తిప్పుతోంది. ఇందులో సికింద్రాబాద్‌ నుంచి 17 ప్రత్యేక ట్రిప్పులున్నాయి. ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లు నడువనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడు.. ప్రతిరోజు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 9 గంటలన 25 నిమిషాలకు దానాపూర్‌కు ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. అదే విధంగా ప్రతి శుక్రవారం నగరం నుంచి గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు నగరంలో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటుంది. వీటితో పాటు శంశాబాద్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు వెళ్లొచ్చు. రోడ్డు మార్గాన కూడా అయోధ్యకు వెళ్లాలనుకుంటే పర్సనల్ వెహికిల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ లో అయోధ్యకు చేరుకోవచ్చు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్