కారు కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్..ఈ కారు పై ఏకంగా రూ. 50,000 వరకు సూపర్ డిస్కౌంట్..!
ఈ ఏడాది జనవరిలో ప్రముఖ టాటా మోటార్స్ టాటా పంచ్ EVని మార్కెట్లో విడుదల చేసింది. టాటా మోటార్స్ తొలిసారిగా ఈ SUVపై డిస్కౌంట్లను అందిస్తోంది. టాప్ వేరియంట్‌లపై మాత్రమే కంపెనీ ఎక్కువ తగ్గింపులను అందిస్తోంది. ఒకవేళ మీరు ఈ నెలలో టాటా పంచ్ EVని కొనుగోలు చేయాలి అనుకుంటే..ఈ కారు మీకు పూర్తిగా రూ.50,000 తగ్గింపుతో లభిస్తుంది. అయితే, టాటా పంచ్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. కాగా, ప్రస్తుతం ఈ కారు ఫీచర్లపై అందుబాటులో ఉన్న తగ్గింపుల గురించి తెలుసుకుందాం.
టాటా పంచ్ EV లాంచ్ అయిన తర్వాత మొదటిసారిగా రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..ఈ తగ్గింపు దాని టాప్-స్పెక్ పంచ్ EV ఎంపవర్డ్ + S LR AC ఫాస్ట్ ఛార్జర్‌పై మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.10.98 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది. అంటే ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేస్తే..ఈ తగ్గింపును పొందవచ్చు.
టాటా పంచ్ EV సింగల్ ఛార్జింగ్ తో 315 కిలోమీటర్లు, 421 కిలోమీటర్ల పరిధి వెళుతోంది. సేఫ్టీ కోసం..ఈ కారులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, హర్మాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ బటన్, టెంపరేచర్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. DC ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఇది కేవలం 56 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఇది కూడా ప్లస్ పాయింట్. టాటా పంచ్ EV, స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.