Wednesday, March 11, 2026

 ఆ రెండు జిల్లాలకు కేంద్రం తీపి కబురు

- Advertisement -

 ఆ రెండు జిల్లాలకు కేంద్రం తీపి కబురు
వరంగల్, మార్చి 11, (వాయిస్ టుడే )

Good News from the Centre for Those Two Districts
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద తెలంగాణలోని వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 చొప్పున మొత్తం 151 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి

టోకన్‌ సాహు రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. అయితే, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి టోకన్ సాహు వెల్లడించారు. విద్యుత్

సౌకర్యాలు, ఇతర నిర్మాణాలు పూర్తయిన తర్వాతే ఈ బస్సులు క్షేత్రస్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు.వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవ

పథకం కింద తెలంగాణకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 51 మెుత్తంగా 151 విద్యుత్తు బస్సులు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్‌ సాహు

వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద నిధుల కేటాయింపు అనే విషయం ఈ-బస్‌లకు

అనుబంధమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీ ద్వారా ప్రతిపాదనలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలూ

అందలేదని మంత్రి టోకన్ సాహూ స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయించిన బస్సుల్లో ఇప్పటివరకూ ఒక్కటి కూడా అక్కడికి తరలించలేదని చెప్పారు. ఈ బస్‌ల నిర్వహణకు అవసరమైన నిర్మాణ, విద్యుత్తు పరమైన

మౌలికవసతుల అభివృద్ధి తర్వాతే వాటిని క్షేత్రస్థాయికి తరలించనున్నట్లు వెల్లడించారు.ఇక 2022-25 మధ్య కాలంలో వరంగల్‌కు 3.52 లక్షల మంది, గోల్కొండకు 47.41 లక్షల మంది, చార్మినార్‌కు

35.85 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. సందర్శకులకు

టికెట్ల విక్రయం ద్వారా గత మూడేళ్లలో గోల్కొండ నుంచి రూ.15.30 కోట్లు, చార్మినార్‌ నుంచి రూ.9.30 కోట్లు, వరంగల్‌ నుంచి రూ.73.71 లక్షల ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు.కాగా, ప్రస్తుతం ఆర్టీసీ

బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసున్నప్పటి నుంచి బస్సులు ఖాళీగా ఉండటం లేదు. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రంలో ఏ మూల నుంచి

ఏమూలకైనా ఫ్రీ జర్నీ ఉండటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. గతంలో హైదరాబాద్ సిటీ బస్సుల్లో మాత్రమే రద్దీ ఉండేది. ప్రస్తుతం జిల్లా బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. తాజాగా కేంద్రం ప్రకటించిన బస్సులతో రద్దీ తగ్గే

ఛాన్సుంది. దాంతో పాటు ప్రయాణికుల ప్రయాణం మరింత సాఫీగా సాగుతుం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్