Saturday, February 21, 2026

శుభవార్త : దిగివచ్చిన పసిడి ధరలు…….

- Advertisement -

శుభవార్త : దిగివచ్చిన పసిడి ధరలు…….

Good news: The prices of pasidi have come down.

బంగారం కొనాలి అనుకునే పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు ఎట్టకేలకు ఇవాళ దిగివచ్చి భారీ ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అల్ టైం హై నుంచి భారీగా పడిపోవడంతో దేశీయ మార్కెట్లలోనూ పసడి ధరలు దిగివచ్చాయి. వెండి రేటు స్థిరంగా అలానే కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఆగస్టు 23వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎంత ఉన్నాయో ఓసారి చూద్దామా……..

పసిడి కొనాలి అనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్. ఈ ఆగస్టు నెలలో పసిడి ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనాలి అని ఆశ పడిన వాళ్లు నిరాశ లోకి వెళ్ళిపోయారు. అలాంటి వారందరికీ ఇదే కొనడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు దిగివచ్చాయి. అమెరికా నిరుద్యోగ రేటు గణాంకాల విడుదల, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఇచ్చే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు ఆల్ టైమ్ హై నుంచి పడిపోయాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయంగానూ రేట్లు దిగి వచ్చేశాయ్. ఆగస్టు 23, 2024 రోజున హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఎంత ఉన్నాయో చూద్దాం……

ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు…

గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. క్రితం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2515 డాలర్ల ఉండగా. ఇప్పుడు అది 2491 వద్దకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 29.09 డాలర్ల వద్దకు దిగివచ్చింది. మరోవైపు భారత రూపాయి విలువ మాత్రం ఎప్పటిలాగానే కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ. 83.948 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

రూ.300 తగ్గిన బంగారం ధర…….

హైదరాబాద్ లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇవాళ 10 గ్రాములపై రూ.300 తగ్గిపోవడంతో తులం రేటు రూ. 66,800 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ రూ.330 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ. 72,870 వద్దకు దిగివచ్చింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో రేట్లు గమనిస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.300 తగ్గడంతో తులం రేటు రూ. 66,950 వద్దకు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు రూ.380 మేర తగ్గి రూ. 72,970 వద్ద ట్రేడింగ్ అవుతుంది.

స్థిరంగా వెండి రేటు…

పసిడి ధరలు దిగివచ్చి ఊరట కల్పించినా వెండి ధరలు మాత్రం బెంబేలెత్తిస్తునాయ్. వరుసగ 10 రోజుల పాటు ఏకంగా రూ.4000 మేర రేట్ పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగానే వెండి ధర కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 92 వేల వద్ద ఉన్నది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.87 వేల వద్ద స్థిరంగా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్