హైదరాబాద్: బాచుపల్లి, కే ఎల్ యునివర్సిటీ ఆపిల్ ఎక్సెలెన్స్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుమాట్లాడారు. రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసిస్తున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం గొప్ప విషయం. ఇక్కడ కూడా ఇంజినీరింగ్ చదువుతున్న వారిలో మహిళలే ఎక్కువ కనిపిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో కూడా మహిళలు సత్తా చాటుతున్నారు. అంతరిక్ష రంగంలో కూడా మహిళలు సత్తా చాటుతున్నారు. యువ ఓటర్లు మీరు. వాస్తవాలు గ్రహించాలి. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం నమ్మొద్దు. నిజం గడప దాటకముందే, అబద్దం ఊరు దాటుతుంది అంటారు. అభివృద్ధిని చూసి నమ్మాలి. సీఎం వ్యవసాయం, ఐటీలో రాష్ట్రాన్ని నంబర్ 1 చేశారని అన్నారు.

నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పిన వాస్తవాలు ఇవి. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, ఒకప్పుడు పంజాబ్ ఉండే. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ నంబర్ 1. వరల్డ్ టాప్ 5 ఐటి కంపెనీలు హైదారాబాద్ నిలయం అయ్యింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్ బుక్ వంటివి ఇక్కడ ఉండటం మనకు గర్వకారణం. ఇతర ప్రాంతాల్లో పడిపోతుంటే, తెలంగాణ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంతో పెరిగింది. గ్రీన్ కవర్ పెరుగుదలలో 7.7 శాతంతో తెలంగాణ నంబర్ 1. 300 కోట్ల మొక్కలు పెంచే తెలంగాణకు హరిత హారంకు సీఎం శ్రీకారం చుట్టారు. ఓట్ల కోసం చేసే పనులు కాదు, భవిష్యత్తు బతుకుల గురించి అలోచించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైద్య విద్య అందుబాటులో లేక రష్యా, ఉక్రెయిన్, చైనా వెళ్ళేవారు. 2014 లో 2850 ఎంబిబిఎస్ సీట్లు ఉంటే, ఇపుడు 10 వేల సీట్లు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించాం. డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. నీతి అయోగ్ అరోగ్య సూచిలో యూపి చివరి స్థానం. 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చెడుకు అట్రాక్ట్ కావద్దు. మన రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో యువత ఆలోచించాలి. ఒకప్పుడు కైకిలి దొరకటం లేదు అనేవాళ్ళు. నేడు కైకిలోల్లు దొరకని పరిస్థితి. బీహార్, యూపీ, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ నుండి ఇక్కడకు పని కోసం వస్తున్నారు. సీఎం కేసీఆర్ విప్లాత్మకమైన పాలసీల వల్ల ఈ మార్పు సాధ్యం అయ్యింది. రజినీ కాంత్ కు ఇక్కడి అభివృద్ధి అర్థం అయ్యింది. కానీ ఇక్కడి గజినీలకు అర్థం కావడం లేదు. యువత అభివృద్ధికి ఓటు వేయాలి. భవిష్యత్ బాగు కోరే ప్రభుత్వాన్ని ఎంపిక చేయాలని అన్నారు..




