విశాఖలో గూగుల్ ఆఫీస్- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం-
Google Office in Visakha - Agreement with AP Govt.
కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
రాష్ట్రంలో విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెదుక్కోవడమే నాయకుల లక్షణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల ఐటీ మంత్రి లోకేష్ అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, దాని ఫలితమే విశాఖకు ఇప్పుడు ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్ స్వాగతోపన్యాసంలో వివరించారు.గతంలో ఐటీ గురించి నిన్నమొన్నా ఏఐ గురించి ఇప్పుడు డీప్ టెక్ అనే సాంకేతికత గురించి మాట్లాడుతున్నామని, విశాఖకు గూగుల్ లాంటి సంస్థలు వస్తే అది గేమ్ చేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సంస్థలు ఏర్పాటైతే ఓ దిక్చూచిగా ఏపీ మారుతుందని చెప్పారు.రాష్ట్రాన్ని నాలెడ్జి ఎకానమీగా మార్చటం, స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణలు రూపోందించాల్సి ఉందన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌరసేవల్ని సులభంగా అందించేలా గూగుల్ తో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సు సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉంది. ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని, ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారని, మార్పును నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో హెచ్చరికలూ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు.గతంలో నెలలో మొదటి తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఇప్పుడు పెన్షనర్లకూ మొదటి తేదీనే పెన్షన్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టప్రకారం శిక్షించాల్సిందేనని, ఆ విషయంలో కలెక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పాలనలో వేగం పెరిగితేనే ప్రజలకు వేగంగా సేవలు అందుతాయి. అప్పుడే పెట్టుబడులు కూడా వస్తాయని, పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడినట్టే జిల్లాల మధ్య కలెక్టర్లు కూడా పోటీ పడాలన్నారు. అభివృద్ధితో సంపద వస్తుంది సంపదతో మళ్లీ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుకట్టపడాలని ముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి, డ్రగ్స్ బ్యాచ్ లు ఉన్నట్టు వెలుగులోకి వస్తోందని, గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాల్సిందేనన్నారు.జిల్లాల్
దీపం 2 కింద 40 లక్షల మందికి లబ్ది కలిగేలా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్టు వివరించారు..