ప్రమాదకరంగా మారిన గోపాలపట్నం కొండవాలు ప్రాంతం

- Advertisement -

ప్రమాదకరంగా మారిన గోపాలపట్నం కొండవాలు ప్రాంతం

Gopalapatnam is a hilly area that has become dangerous

విశాఖపట్నం
విశాఖ జిల్లా గోపాలపట్నం కొండవాలు ప్రాంతం ప్రమాదకరంగా మారిం ది.జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది.కొండవాలు ప్రాం తంలోని పురాతన భవనాలు కూలి పోయే పరిస్థితికి చేరుకున్నారు. కొండవాలుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇప్పటికే కూలిపోయింది. కరెంట్ స్తంభాలు సైతం కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి.వర్షం మరిం తగా కురిస్తే భవనాలు,ఇళ్లు కూలి పోయే ప్రమాదం ఉంది. క్షణంలో నైనా భవనాలు పడిపోయే ప్రమా దం ఉండటంతో అధికారులు అప్ర మత్తమయ్యాయి. భవనాలు, ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. స్థానికులను పునరావాసాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఘటన స్థలాన్ని పరిశీలిం చారు.రెవెన్యూ, పోలీసులు, అధికా రులు సహాయ చర్యలు అందిస్తు న్నారు. 13 ఇళ్లల్లోని 37 మంది ప్రజలకు పునరావాసాలకు తరలిం చారు. ప్రాణ నష్టం కాకుండా జాగ్రత్త లు తీసుకుంటున్నారు. భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో పక్కనున్న బిల్డింగులను సైతం ఖాళీ చేయించారు. పై నుంచి వస్తున్న వాటర్ను డైవర్ట్ చేస్తే ప్రమాదం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular