తిరుపతి దేవస్థానమే గోశాలలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

తిరుపతి దేవస్థానమే గోశాలలు ఏర్పాటు చేయాలి

Goshalas should be established in Tirupati Devasthanam itself

– సామాజిక కార్యకర్త ముత్యం బాలగంగాధర్ రెడ్డి

పిడుగురాళ్ల
పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం లో పలు రకాల జీవుల కొవ్వు
పదార్థాలను వినియోగిస్తున్నట్టు భారతదేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం బాధాకరమని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల కు చెందిన సామాజిక కార్యకర్త ముత్యం బాలగంగాధర్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పిడుగురాళ్ల ఆర్ అండ్ బి బంగ్లా ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డు కల్తీ ఆవు నెయ్యి వివాదంతో ప్రపంచంలోని కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు, తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు. కావున తిరుమల తిరుపతి దేవస్థానమే ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 175 గోశాలలు ఏర్పాటు చేయాలని, టీటీడీ ఆవు నెయ్యితో శుభ్రమైన లడ్డులను తయారు చేయాలని, శ్రీవారి భక్తులకు భరోసా ఇవ్వాలని, తిరుమల పవిత్ర కు ప్రతిష్టకు కాపాడాలని టిటిడి బోర్డు పాలకులను ఈ సందర్భంగా ఆయన కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular