Friday, December 27, 2024

సినీ మోజులో వచ్చి.. డ్రగ్స్‌కు బానిసై

- Advertisement -

సినీ మోజులో వచ్చి.. డ్రగ్స్‌కు బానిసై

హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిగా…

తర్వాత విక్రయంలోకి.. గుంటూరు, సైబరాబాద్‌లోనూ కేసులు’

సినీ ఆర్టిస్ట్‌ లావణ్య రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే విషయాలు

14 రోజుల రిమాండ్‌.. ఇతర నిందితుల కోసం విస్తృత గాలింపు

సినిమాల్లో నటించాలనే ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చి.. మధ్యలో చదువు కొనసాగించి.. అనంతరం డ్రగ్స్‌కు బానిసై.. ఏకంగా సరఫరాదారుగా మారిందా యువతి. ఓవైపు సంగీతం పాఠాలు చెబుతూనే.. మరోవైపు డ్రగ్స్‌ అమ్మకం సాగించింది. పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. నగర శివారు నార్సింగిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ను పరిశీలించగా విస్తుపోయే అంశాలున్నాయి. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నె లావణ్య (32) అలియాస్‌ అన్విత సినీ అవకాశాల కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చింది. సోదరుడు కార్తీక్‌తో కలిసి పటాన్‌చెరులో ఉండేది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసింది. 2014లో ఓ షార్ట్‌ ఫిలింలో నటిస్తుండగా శేఖర్‌రెడ్డి ద్వారా ఉనీత్‌రెడ్డి పరిచయం అయ్యాడు. సన్నిహితులుగా మారిన వీరిద్దరూ కొన్ని షార్ట్‌ ఫిలింలలో నటించారు. లావణ్య మ్యూజిక్‌ నేర్చుకుని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు చెబుతోంది. కాగా, ఉనీత్‌రెడ్డితో సాన్నిహిత్యంతో జల్సాలకు అలవాటుపడింది. వరసకు సోదరుడయ్యే వ్యక్తికి చెందిన కోకాపేటలోని పావని బోలావడ్‌ విల్లాకు నివాసాన్ని మార్చింది. క్రమంగా డ్రగ్స్‌కు బానిసగా మారిన లావణ్య మూడేళ్లుగా సరఫరా కూడా చేస్తోంది. ఉనీత్‌రెడ్డి బెంగళూరు, గోవా నుంచి రూ.1500కి గ్రాము చొప్పున కొని హైదరాబాద్‌ తరలిస్తాడు. లావణ్య, ఈ కేసులో పరారీలో ఉన్న ఇందిరతో రూ.6 వేలకు గ్రాము చొప్పున అమ్మించేవాడు. దీంతోపాటు లావణ్య, ఉనీత్‌రెడ్డి డ్రగ్స్‌ తీసుకునేవారు. ఈ దందాపై మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం శంకర్‌పల్లి-నార్సింగి రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో లావణ్య వద్ద 4 గ్రాముల ఎండీఎంఏ దొరికింది. సినీ ఇండస్ట్రీ వారితో పాటు చాలామంది ప్రముఖలతో లావణ్యకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఆమే ఉంటున్నట్టు పొలీసులు గుర్తించారు. ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కేసులో లావణ్యను పోలీసులు ఎ-2గా చేర్చారు. ఎ-1గా ఉనీత్‌రెడ్డిని, ఎ-3గా ఇందిర అలియాస్‌ ఇందును పేర్కొన్నారు. ఉనీత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారన్న విషయాన్ని పోలీసులు ఖండించారు. ఇందు కోసం గాలిస్తున్నారు. లావణ్యను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వరలక్ష్మి టిఫిన్స్‌ కేసులోనూ..!

లావణ్య ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీ్‌సస్టేషన్‌లో 2022లో కేసు నమోదైందని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. 2023లో మోకిల పోలీ్‌సస్టేషన్‌లో ఉనీత్‌రెడ్డి, లావణ్యపై మరో కేసు నమోదైంది. డ్రగ్స్‌ వాడుతూ ఉనీత్‌ దొరికిపోయాడు. అంతకుముందు వీరు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు దొరకకుంటే లావణ్య విదేశాలకు పారిపోయేదని పోలీసులు పేర్కొన్నారు. వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో కూడా ఆమెను అనుమానితురాలుగా భావించినా ఆధారాలు లభించలేదు. లావణ్య ఫోన్‌ కాంటాక్టులు, ఇతర చాటింగ్స్‌, సోషల్‌ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్