కూకట్ పల్లి ; అక్టోబర్ 28(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ సభ్యులు గొట్టిముక్కల వెంగళ్ రావు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వెంగళ్ రావు మాట్లాడుతు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కి సేవలు అందించానని, కూకట్ పల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని హేళన చేసి మాట్లాడినపుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ జెండా వదల్లేదని అన్నారు. 3సార్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న స్థానికులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరులకు కట్టబెట్టి పార్టీ ఉనికి కోల్పోయే స్థితిలో ఉందన్నారు. ఈ సారి స్థానికులకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో వేచి చూశామని, అయినప్పటికీ మరోసారి అధిష్టానం స్థానికేతరులకే టికెట్ కేటాయించడంతో బాధాతప్త నయనాలతో రాజీనామాకు సిద్ధపడ్డానన్నారు. బయట వాళ్లకు టికెట్ ఇవ్వడంతో బాధపడరు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదని, పార్టీ ని నమ్ముకున్న వాళ్ళు కాకుండా కాంగ్రెస్ పార్టీ కండువా ఎలా వేసుకోవలో తెలియని వాళ్ళకి టికెట్ ఇవ్వడం చాలా సిగ్గుగా అనుపించిందన్నారు.
బయట వాళ్ళకి టికెట్ ఇస్తే కార్యకర్తలు దూరమవుతారని అన్నారు. పార్టీ కి రాజీనామా చేస్తూ ఎవరూ బాధపడరని, పార్టీ టికెట్ అమ్ముకున్నారనే భాధ కలుగుతుం దన్నారు. పీసీసీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇంటికి వచ్చి నన్ను గెలిపించాలని అడిగితే రాత్రి పగలనక కష్ట పడి ఆయన్ని ఎంపీ గా గెలిపించామని, వెంగళ్ రావు అన్నా నీకే టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి కూకట్ పల్లి కాంగ్రెస్ టికెట్ ను అమ్ముకున్నారని, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ ని గెలవకుండా చేస్తానని అన్నారు. రాజీనామా చేసి రెండు రోజులు తరవాత ఏ పార్టీ లోకి వెళ్ళాలో కార్యకర్తలతో చర్చించి మీడియా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు ఆవేధనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్ సెల్ చైర్మన్ జి. విశ్వతేజ్ రావు, గూడెపు నాగరాజు, సీనియర్ నాయకులు బషీర్, ఫణీందర్, రాజమల్లయ్య, గణేష్, బండారి ప్రవీణ్ గౌడ్, అరుణ్ గోవింద్, గురుమూర్తి, సునీల్, మహిళా నాయకులు రేష్మ, కృషవేణి, సంధ్య, కల్పన తదితరులు పాల్గొన్నారు