Thursday, January 15, 2026

బి.సి రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు :ఆర్ కృష్ణయ్య

- Advertisement -

బి.సి రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు
 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బి.సి.లను మోసం దగా చేసింది
 హస్తనాపురం చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరకు బి.సి.ల భారి ప్రదర్శన
హైదరాబాద్ నవంబర్ 19

Government has no intention of increasing BC reservations: R Krishnaiah
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఊరించి – ఊరించి చివరకు పాత జీవో ప్రకారం 22 శాతం అమలు చేస్తామని మొన్న క్యాబినెట్ లో నిర్ణయించడం అన్యాయం. ఈ నిర్ణయం ఉపసంహరించుకొని 42 శాతం అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ వేలాదిమంది విద్యార్థులు నేడు గ్రేటర్ హైదరాబాద్ హస్తనాపురం చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ నాయకత్వం వహించారు. బి.సి ఐక్య వేదిక అధ్యక్షులు అనంతయ్య, రాష్ట్ర బి.సి సంఘం అధ్యక్షులు రాజేందర్ సమన్వయము చేశారు.ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. 42శాతం అమలుకు,  బీసీలకు చట్టబద్ధంగా ఇచ్చేందుకు మొదటి నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి కృషి చేయలేదు. రిజర్వేషన్ల కేసు హైకోర్టులో నడుస్తుండగా తీర్పు రాకముందే ఎన్నికలు జరగవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సర్పంచ్ కాలపరిమితి ముగిసిన 2 సంవత్సరాలు గడిచిన ఈ రిజర్వేషన్ల సమస్య కోర్టులో తేలలేదు. ఇంకో నెల – రెండు నెలలో తీర్పు వస్తుంది. అప్పటివరకు ఎన్నికలు ఆపడానికి అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు.ప్రభుత్వానికి ఈ రిజర్వేషన్లు చట్టబద్ధం చేయడానికి సమస్య పరిష్కారానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ఏ ప్రయత్నం చేయడం లేదు. అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి కలవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదు. అలాగే పార్లమెంటులో లోక్ సభ లో కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఒకనాడు కూడా ఈ కూటమి సభ్యులు బీసీ రిజర్వేషన్ల సమస్యపై పార్లమెంట్ లో ప్రశ్నించలేదు. వాకేట్ చేయలేదు. ఇతర అంశాలపై నెలల తరబడి పార్లమెంటు బహిష్కరించారు. కాంగ్రెస్ ఎంపీలు బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు నోరెత్తడం లేదు. ఇదే నా వీరి చిత్తశుద్ధి అన్నారు.నిన్న జరిగిన క్యాబినేట్ లో మొదటగా గ్రామా పంచాయితీ ఎన్నికలు జరుపుతాం అని ప్రకటించారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు పార్టీపరంగా ఉండవు. పార్టీ పరంగా 42 శాతం ఇస్తామని చెప్పడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. ఇది పచ్చి మోసం – దగా యున్నారు. మార్చి లోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 3వేల కోట్లు వృథా అవుతాయని ముఖ్యమంత్రి అంటున్నారు. 3 వేల కోట్ల బడ్జెటు కంటే బి.సి రిజర్వేషన్ ముఖ్యం. ఎందుకంటే 3వేల కోట్లను సర్దిచేయడం సులువే కాని 2 కోట్ల మంది బి.సి సమాజం ఎదురుచూస్తున్నా రిజర్వేషన్లను పెంచక పోవడం అన్యాయం కాదాయన్నారు. మర్చి లోగా బడ్జెటు ఆగిపోతాయి అన్నారు. మార్చికి ఇంకా 4 నెలలు సమయం యున్నది. హై కోర్టు లో ఉన్న కేసు నెలలోపు పూర్తి అవుతుంది. ఇంతలో అఖిల రాజకీయ పక్షాలతో ప్రధానమంత్రితో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయవచ్చు. అలాగే హై కోర్టులో కేసు గెలిచే అవకాశం యుంది. రాజ్యంగాబద్దంగా, చట్ట బద్దంగా కేసు బలంగా యుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది దాని ప్రకారం  అసెంబ్లీ చట్టం చేశారు. అలాగే జనాభా లెక్కలు ఉన్నవి. అలాగే సుప్రీంకోర్టు అగ్ర కులకు 10శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. పైగా ఇందిరా సహానీ కేసులో ఎంపరికల్ డాటా ఉంటే 50% సీలింగ్ ను అధిగమించవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉన్నది. దీనిలో న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. చట్ట ప్రకారము, న్యాయప్రకారము రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు కావున కోర్టులో కేసు గెలుస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు కేసు బలంగాయుంది. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారీగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారు. భారీ ఎత్తున్న జరిగిన ఈ ప్రదర్శనకు పోలీస్ బందోబస్తు భారీగా చేసారు.ఈ ప్రదర్శనలో పగిళ్ళ సతీష్, నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, రాజ్ కుమార్, అజయ్, అంజి గౌడ్, శివ యాదవ్, అఖిల్, ప్రేం, ప్రవీణ్, వంశీ, అరుణ్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్