- Advertisement -
ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది
Government has seriously failed to support the people
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్
ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఏడతెగని కన్నీరు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలి వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలి. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలి. ఆహారం నీరు అందుబాటులో ఉంచాలి.అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతున్నది. వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉంది. అన్ని శాఖలు అప్రమత్తం కావాలి. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.
- Advertisement -



