- Advertisement -
అర్చకుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
Government is committed for the welfare of priests
దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు
మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్
శాసనమండలిలో ఎండోమెంట్స్ మినిస్టర్ కొండా సురేఖ మాట్లాడారు. దూపదీప నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నెలకు రూ. 4 వేలు దూపదీప నైవేద్యం కోసం, అర్చకుల గౌరవ వేతనం రూ. 6 వేలు మొత్తం పది వేలు ఇస్తున్నాం. దూపదీప నైవేద్యం కోసం పదేండ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. వైఎస్ హయాంలో రూ. 2500 దూపదీప నైవేద్యం కింద 1205 దేవాలయాలను గుర్తించాం. 2015 వరకు కొనసాగించారు. ఆ తర్వాత గత ప్రభుత్వం రూ. 6 వేలకు పెంచిందని అన్నారు.
2023లో 10 వేలకు పెంచింది. అప్పుడు గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. గతేడు పెంచారు కాబట్టి పెంపు ఆలోచనపై సమాలోచనలు చేయాల్సి ఉంది. అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దాదాపు 6,541 దేవాలయాలకు ప్రతినెల రూ.6,27,10,000 పారితోషికం చెల్లిస్తున్నాం. సంవత్సరానికి రూ.75 కోట్లు చెల్లిస్తున్నాం. రూ. 73.22 కోట్ల బడ్జెట్ కేటాయించి మంజూరు చేశాం. రూ. 62.69 కోట్లు ఖర్చు కూడా చేశాం. దూపదీప నైవేద్యం కింద రాని దేవాలయాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అర్హత ఉన్న దేవాలయాలకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటాం. అన్యాక్రాంతమైన భూములపై ప్రతి జిల్లాలోని దేవాలయాల భూములపై సర్వే చేయాలని ఇప్పటికే ఆదేశించాం. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు.
పవర్గ్రిడ్స్కు దగ్గరగా ఉన్న భూముల్లో సోలార్ ప్లాంట్లను దూరంగా ఉన్న భూముల్లో పామాయిల్ సాగు చేయబోతున్నాం. ఆదాయ సముపార్జన చేసి దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. పక్క రాష్ట్రంలోని మన ప్రభుత్వ భూములను వివరాలను సేకరిస్తున్నాం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్చకుల, సిబ్బందికి సంక్షేమ నిధికి ట్రస్ట్ను 1998లో ఏర్పాటు చేశారు.
రూ 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం దేవాలయాల నుంచి మూడు శాతం నిధులు సేకరించి అర్చకుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం.
ఉపనయనానికి 50 వేల సబ్సిడీతో లక్ష రూపాయలు, పెండ్లి అయితే లక్ష సబ్సిడీతో 2 లక్షలు ఇవ్వనున్నాం. బ్రాహ్మణ పరిషత్ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కట్టిన గుడుల్లో సదుపాయాలను కల్పించలేదు. యాదగిరి గుట్టలో కనీస వసతులు కల్పించలేదు. పేదలు, సామాన్యులు గుడికి వెళ్తే అక్కడ నిల్చోడానికి కూడా ఏర్పాట్లు లేవు. ప్రజాప్రభుత్వం వచ్చాక సౌకర్యాలు ఏర్పాటు చేశాం.క్యూలో వెళ్లడానికి సౌకర్యాలు, టాయిలెట్లు ఏర్పాటు చేశాం. డోనేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. బ్యాటరీ వాహనాలు చిన్న పిల్లలు, వృద్ధులు వికలాంగులకు దర్శనం నిమిత్తం ఏర్పాటు చేయించాం. అఖండ జ్యోతి ఏర్పాటు చేశాం.యాదగిరిగుట్ట స్థానికులకు గర్బగుడి దర్శనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. 63 కిలోల బంగారు తాపడం కోసం అనుమతులు ఇచ్చాం. బ్రహ్మోత్సవాల లోపు ఈ పనులు పూర్తవుతాయి. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయిలో పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ దేవాలయాలైన కీసరగుట్ట, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి కొత్తగూడెం, బాసరల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేస్తాం. గతంలో ఈవోలో టెండర్లు పిలిచి యధేచ్ఛగా పనులు జరిగేవి. తమ ప్రభుత్వం వచ్చాక టెండర్ల ప్రక్రియ ప్రభుత్వ ఆధీనంలోనే జరిగేలా చర్చలు చేపట్టాం. ఆలయాల్లో విజయ నెయ్యిని మాత్రమే వాడి ప్రసాదాలను తయారు చేయాలని సూచించాం. అన్నదానాలపై, కల్యాణ మండపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 12 సంవత్సరాలు దాటితే కుంభాభిషేకం చేయాల్సి ఉంటుంది. కానీ చాలా ఆలయాల్లో జరగలేదు. అన్ని ఆలయాల్లో ఇది జరుగుతుంది. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా కుంభాభిషేకం చేస్తాం. 13 ఏండ్లుగా దేవాలయ శాఖలో ప్రమోషన్లు లేక ఉద్యోగుల నైరాశ్యంలో ఉన్నారని, తాము వచ్చాక ప్రమోషన్లు ఇచ్చాం. ఎంతో మందిని ఈవోలుగా ప్రమోట్ చేశామని అన్నారు.
- Advertisement -